ఆగష్టులో జీవీ ప్రకాష్- యశ్వంత్ మూవీస్ `బ్రూస్లీ`

GV Prakash Brucelee Movie release in August
GV Prakash Brucelee Movie release in August

మ్యూజిక్ డైరెక్టర్ కం హీరో జీవీ ప్రకాష్కుమార్ నటించిన తమిళ చిత్రం `బ్రూస్లీ` తెలుగులో అదే పేరుతో రిలీజ్ కానుంది. ఆ మేరకు ఈ సినిమా అనువాద కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని నిర్మాత తెలిపారు. యశ్వంత్ మూవీస్ పతాకంపై డి.వెంకటేష్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ఆగష్టులో ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ -“జీవీ ప్రకాష్ నటించిన పలు చిత్రాలు తెలుగులో ఇప్పటికే రిలీజై చక్కని విజయం సాధించాయి. తమిళంలో జీవీ ప్రకాష్ హీరోగా తెరకెక్కి, ఘనవిజయం సాధించిన `బ్రూస్లీ` చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నాం. అనువాద కార్యక్రమాలు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆగష్టులో సినిమా రిలీజ్ చేయనున్నాం“ అని తెలిపారు. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి జీ.వీ.ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కెమెరా: పి.వి.శంకర్, ఎడిటింగ్: ప్రదీప్.ఇ.రాఘవ్

Loading...