జూలై 16న విజయవాడలో ‘నిన్నుకోరి’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ఎల్పి పతాకంపై శివ నిర్వాణను దర్శకుడిగా పరిచయం చేస్తూ దానయ్య డి.వి.వి. నిర్మించిన చిత్రం ‘నిన్నుకోరి’. ఇటీవల విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్ చిత్రంగా అందరి ఆదరణ పొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి అపూర్వ ఆదరణ అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు జూలై 16 సాయంత్రం 6 గంటలకు విజయవాడ బందర్ రోడ్‌లోని ఎ-1 కన్వెన్షన్ సెంటర్లో ‘నిన్నుకోరి బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ సెలబ్రేషన్స్‌లో నేచురల్ స్టార్ నాని, హీరోయిన్ నివేదా థామస్, ప్రత్యేక పాత్ర పోషించిన ఆది పినిశెట్టితోపాటు టోటల్ యూనిట్ పాల్గొంటుంది.

Loading...