డ్రగ్స్ కేసులో ముగిసిన నటుడు నవదీప్ విచారణ

tollywood-drug-scandal-navdeep-sit-interrogation
tollywood-drug-scandal-navdeep-sit-interrogation

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో పూరీ, నవదీప్‌లది కీలక పాత్రగా అధికారులు భావిస్తున్నారు. తరచుగా విదేశాలకు, గోవాలకు వెళ్తుండటంతో అంతర్జాతీయ డ్రగ్స్‌ సరఫరా మాఫియా ప్రముఖులతో వారికి ప్రత్యక్ష సంబంధాలున్నాయని అనుమానిస్తున్నారు. ముఖ్యంగా నవదీప్‌ ఈమద్య నటన కంటే పార్టీలు, ఈవెంట్స్‌ని బాగా నిర్వహిస్తూ ఉండటం, పలు పార్టీలలో ప్రత్యేకమైన అతిధులు కోరితే కాక్‌టైల్‌తో కలిపిన డ్రగ్స్‌ ఉండే ద్రవాన్ని ప్రత్యేకంగా సరఫరా చేసేవాడనే నిజాలు అధికారులకు ఆధారాలతో సహా లభించాయి. గతేడాదిలోనవదీప్‌కి చెందిన గెస్ట్‌హౌస్‌లో పర్మిషన్‌ లేకుండా సప్లై చేస్తున్న మద్యం కేసులో రైడ్‌ చేసి ఓ వక్తిని కూడా అరెస్ట్‌ చేశారు.

మరోవైపు కేవలం నవదీప్‌, తరుణ్‌లకు చెందిన పబ్బులలోనే ఈ విధమైన డ్రగ్స్‌ కలిపిన ప్రత్యేక పానీయం ఆ డ్రింక్‌ కోడ్‌ని అడిగిన వారికి భారీరేటును ప్రత్యేక రూంలలో సప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తరుచుగా విదేశాలకు. గోవాలకి వెళ్లే నవదీప్‌ అక్కడి డ్రగ్స్‌ సరఫరా దారులతో నేరుగా పరిచయాలు, ఇంటర్నేషనల్‌ సెల్‌నెంబర్లు, తరుచుగా అతని పబ్‌కి గోవా నుంచి డ్రగ్స్‌ సప్లై కావడం, డ్రగ్స్‌ వినియోగంలోనే కాదు.. జీషన్‌ అలీతో ఈ ప్రత్యేక డ్రింక్‌ తయారు చేయించి, పార్టీలు, ఈవెంట్స్‌లో పంపిణీ చేయడం వంటి పలు తీవ్రమైన ఆరోపణలు వస్తుండటంతో మధ్యాహ్నం నుంచి స్వయాన అకుల్‌ సబర్వాలే నేరుగా రంగంలోకి దిగాడని సమాచారం.సిట్ విచారణలో నవదీప్ మరి కొంత మంది ప్రముఖ హీరోల పేర్లను చెప్పినట్లు సమాచారం.

సిట్ అధికారుల 11 గంటల పాటు విచారణ తర్వాత నవదీప్ మీడియాతో మాట్లాడుతూ సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాను అని అన్నారు.

Loading...