తమన్నా పెళ్లి గురించి ఏమందంటే…..

Actress Gorgeous Tamanna Bhatia Cute Photos at Baahubali Promotions

మిల్కీ బ్యూటీ తమన్నా కుటుంబంలో పెళ్లి వేడుక ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. కొన్నాళ్లుగా సినిమాలు.. ఇతర కమిట్మెంట్లన్నీ పక్కన పెట్టేసి తన సోదరుడు ఆనంద్ పెళ్లి మీదే దృష్టిపెట్టింది తమ్మూ. మూడు రోజుల పాటు పాటు జరిగిన ఈ వేడుకలకు సంబంధించి తమన్నా ఉన్న ఫొటోలు ఇప్పుడు నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. జూలై 1న ముంబైలోని ఇస్కాన్ మందిరంలో వివాహం జరిగింది. పెళ్లి ఫొటోల్ని ఫొటోగ్రాఫర్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశాడు. ఈ వేడుకలో తమన్నా.. నీతూ లుల్లా డిజైన్ చేసిన లహంగా వేసుకుంది. ఈ వేడుకలో తమన్నా డ్యాన్స్ చేస్తూ సందడి చేయడం విశేషం.

తన సోదరుడి పెళ్లి విషయమై తమన్నా చాలా ఎగ్జైట్ అయింది. ఇప్పుడు తనకెంతో ఆనందంగా ఉందని.. తన బ్రదర్ డ్రీమ్స్ నెరవేరాయని.. తన అన్నయ్య-వదిన ఒకరి కోసం మరొకరు పుట్టారని.. తన వదిన తమ కుటుంబంలోకి వస్తున్నందుకు తామందరం అదృష్టవంతులమని తమన్నా చెప్పింది. అన్నయ్య పెళ్లి గురించి అంత ఎగ్జైట్ అవుతున్న తమ్మూను.. ఇంతకీ మీ పెళ్లేంటి అని అడిగితే.. ‘‘నాకు పెళ్లి అనే సంప్రదాయం మీద ఎంతో గౌరవం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం సినీ కెరీర్ మీదే నా దృష్టంతా’’ అనేసింది. ప్రస్తుతం తమన్నా తమిళంలో విక్రమ్ సరసన ‘స్కెచ్’ అనే సినిమాతో పాటు.. ‘పెళ్లిచూపులు’ రీమేక్ లోనూ నటిస్తోంది. హిందీలో ‘ఖామోషీ’ అనే సినిమాలో నటిస్తోంది.

Loading...