నయనతార `వాసుకి` సాంగ్ రిలీజ్ చేసిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్

vasuki audio released by sai dharamtej nayantara
vasuki audio released by sai dharamtej nayantara

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ `వాసుకి` సినిమాలోని సాంగ్‌ను విడుదల చేశారు. శ్రీరామ్ సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత ఎస్.ఆర్.మోహన్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సినిమా ‘వాసుకి’. నయనతార టైటిల్ పాత్రలో నటించింది. ఈ సినిమా జూలై 28న విడుదలవుతుంది. పాట విడుదల అనంతరం సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ …“ మంచి మెసేజ్ ఉన్న సినిమాతో ఇండస్ట్రీలోకి వస్తోన్న నిర్మాతలు మోహన్‌గారికి, శ్రీరామ్‌గారికి నా అభినందనలు. గోపీసుందర్‌గారు అందించిన ట్యూన్ బావుంది. అలాగే కొన్ని సీన్స్ చూశాను. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సూపర్బ్‌గా ఉంది. మలయాళంలో నయనతారగారి నటనకు ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను“ అన్నారు.
నిర్మాత ఎస్.ఆర్.మోహన్ మాట్లాడుతూ.. ఈరోజు నేను సినిమా విడుదల చేసే స్థాయికి వచ్చానంటే కారణం కూడా సినిమానే. `వాసుకి` చిత్రాన్ని జూలై 28న విడుదల చేస్తున్నాం. సమాజంలో ప్రస్తుతం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యను సందేశాత్మకంగా తెరకెక్కించిన సినిమా ఇది. నయనతారగారి నటన హైలైట్‌గా ఉంటుంది. సాంగ్‌ను విడుదల చేసి మాటీంకు సహకారం అందించిన సాయిధరమ్ తేజ్‌గారికి థాంక్స్. మా ప్రయత్నాన్ని ప్రేక్షకుల ఆశీర్వదిస్తారనుకుంటున్నాను“ అన్నారు.

Loading...