నల్లగొండ జిల్లాలో భూకంపం

earthquake in nalgonda
earthquake in nalgonda

నల్గొండ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయి.నల్లగొండ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో జరిగింది. జిల్లాలోని సాగర్, పెద్దవూర, గుర్రంపొడు, హాలియా ప్రాంతాల్లో ప్రకంపనలు బాగా వచ్చాయి. పది సెకన్ల పాటు ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెప్పారు. ఇంట్లోని వంట గదిలో సామాన్లు కింద పడ్డాయి. ఫ్యాన్లు ఊగాయి. దీంతో జనం భయపడ్డారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. వీధుల్లో భూప్రకంపనలపై చర్చించుకున్నారు. అనుములవారిగూడెంలో పాఠశాల భవనానికి, అంగన్ వాడీ కేంద్రానికి పగుళ్లు ఏర్పడ్డాయి. ఇళ్లకు పగుళ్లు వచ్చాయనే సమాచారంతో గుర్రంపూడు తహశీల్దార్ సైదులు మొసంగికి వెళ్లి ఆరా తీశారు.

Loading...