నూతన నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ లో నాని ద్విపాత్రాభినయం చిత్రం

గత సంవత్సరం అత్యదిక విజయాలు అందుకున్న యువ కథానాయకుడు నాని ఈ సంవత్సరం ఆరంభంలో నేను లోకల్ అనే చిత్రం ద్వారా అభిమానులను పలకరించి విజయాన్ని అందుకున్నారు, ఆ తరువాత యువ కథానాయిక నివేథ థామస్ తో కలిసి నూతన దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో తాజాగా వచ్చిననిన్నుకోరి చిత్రం కూడా మొదటిరోజు నుంచే ఎంతో విజయవంతంగా ప్రదర్శింపబడుతూ విజయపథం వైపుగా సాగిపోతుంది.

వెంకటాద్రి ఎక్ష్ప్రెస్స్ మరియుఎక్ష్ప్రెస్స్ రాజా అనే విజయవంతమైన చిత్రాల ద్వార తెలుగు పరిశ్రమకు పరిచయమై, యువ దర్శకుడుమేర్లపాకగాంధీతో నాని తన 21వ చిత్రాన్ని తాజాగా రెండు రోజులక్రితం అధికారికంగా ప్రకటించారు, నాని మరొకసారి ద్విపాత్రాభినయం చేయబోతున్నఈ చిత్రానికి కృష్ణార్జున యుద్ధం అనే పేరును చిత్ర బృందం ప్రకటించింది. యువ నిర్మాతలు సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది మొదలుపెట్టిన Shine Screens అనే నూతన నిర్మాణ సంస్థలో మొదటి చిత్రంగా నిర్మించబడుతున్న ఈ చిత్రంతో మంచి వినోదాత్మకమైనకథను తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నారు.

కాగా ఈ చిత్రానికి తమిళ సంగీత యువ కెరటం హిప్ హప్ తమీజా సంగీతం అందిస్తున్నారు. ఇతను గతంలో దృవ చిత్రానికి సంగీతం అందించారు, ఆ చిత్ర విజయంలో సంగీతం కూడా ప్రాదాన్యత సంతరించుకున్న విషయం తెలిసిందే.

ఈ నెల చివరలో చిత్రం యొక్క మొదటి దశ చిత్రీకరణ మొదలుకానుంది. త్వరలో ఈ చిత్రంలోని నటీనటులు, మరియు సాంకేతిక నిపుణుల వివరాలు అధికారికంగా ప్రకటిస్తారు.

Loading...