ప్రారంభం కానున్న మూడవ విడత హరితహారం

తెలంగాణ వ్యాప్తంగా రేపు(బుధవారం) మూడవ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభం కానుంది. మానేరు డ్యాం తీరంలో మొక్కలు నాటి సీఎం కేసీఆర్ ను హరితహారం ను ప్రారంభిస్తారు. ఉదయం కరీంనగర్‌కు చేరుకోనున్న సీఎం ఉదయం 11.20 గంటలకు మానేరు డ్యాం తీరంలో మొక్కలు నాటుతారు. మధ్యాహ్నం 12 గంటలకు కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12.35 గంటలకు అంబేద్కర్ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అటు రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ ఎత్తున మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ, అధికార టీఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఇప్పటికే నడుంబిగించాయి.

Loading...