ఫలించిన ఎంపీ కవిత కృషి

సింగరేణిలో పనిచేస్తున్న మహిళా నాన్ ఎగ్జిక్యూటివ్ (NCWA) ఉద్యోగినులకు సింగరేణి యాజమాన్యం తీపికబురు అందించింది. మెటిర్నటీ సెలవును 12 వారాల నుండి 26 వారాలకు పెంచుతూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
అలాగే సింగరేణిలో పనిచేస్తున్న అవుట్ సోర్సు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ కనీస వేతనాలను అమలు చేయాలని కూడా నిర్ణయించారు. ఈ మేరకు సింగరేణి సిఎండి ఎన్. శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. సింగరేణి గుర్తింపు సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కార్మికుల పక్షాన మెటర్నిటీ లీవ్ లను పెంచాలని, ఔట్ సోర్సింగ్ కార్మికుల వేతనాలు పెంచాలని సింగరేణి యాజమాన్యం ను ఇటీవల కోరారు. కవిత విజ్ఞప్తి కి యాజమాన్యం సానుకూలంగా స్పందించి, ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఉత్తర్వులతో 14,921 మంది అవుట్ సోర్సు కార్మికులు లబ్ధి పొందుతారు. యాజమాన్యంపై నెలకు సుమారు రూ. 2.07 కోట్ల అదనపు భారం పడనుంది. ఈ సందర్భంగా, సింగరేణి మహిళా ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంపి కల్వకుంట్ల కవిత కు కృతజ్ఞతలు తెలిపారు.

Loading...