బర్నింగ్ స్టార్ కి రూ.16 లక్షల ఫైన్‌

Burning Star Samporneshbabu fined 16lacs bigg boss jr ntr
Burning Star Samporneshbabu fined 16lacs bigg boss jr ntr

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్‌బాబు ‘బిగ్‌బాస్’ షోలో ఉండలేక బయటకు వచ్చేశాడు. ‘బిగ్‌బాస్’ షో నుండి బయటికి రావటం వలన కష్టాలు మొదలయ్యాయా? అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు.ఈ బర్నింగ్ స్టార్ కి రూ.16 లక్షల ఫైన్‌ ఆర్గనైజర్స్ వేయనున్నట్లు ఓ వార్త ఫిల్మ్‌నగర్ లో హంగామా చేస్తోంది. ఇంతకీ బిగ్‌బాస్ ఆర్గనైజర్లు జరిమానా వేయడం ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం..

బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో సంపూర్ణేష్‌బాబు బయటకు వచ్చేశాడు. ఈ షో.. వాతావరణం తనకు అంతగా నచ్చలేదని ఉండలేక పోతున్నానని ఆవేశానికి లోనైన ఆయన, షోకి నమస్కారం పెట్టేశాడు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన తాను, ఒకే ఇంట్లో నాలుగు గోడల మధ్య జీవించలేకపోతున్నానని తెలిపాడు. ఇష్టప్రకారమే ఈ షోకి వచ్చావని బిగ్‌బాస్ చెప్పినా, సంపూర్ణేష్ పట్టించుకోలేదు. దీంతో ఆయన బయటకు వచ్చేసిన విషయం తెల్సిందే! ఐతే, ఎగ్రిమెంట్ ప్రకారం.. షో నుంచి బయిటకు పంపకుండా, తనంతట తాను వస్తే ఫైన్ పడుతుందని ముందే రాసుకున్నారట షో నిర్వాహకులు. అతనికి బిగ్‌బాస్ పోగ్రామ్‌కు చెందిన ఐడియా సరిగా లేక ఇలా చేస్తున్నాడని, ఇందులోకి రావడమంటే షూటింగ్ మాదిరిగా ఫీలై వచ్చాడని అంటున్నారు. అంత జరిమానా అంటే ఈ హీరో కట్టగలడా? అన్న ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

Loading...