మత్తు మాఫియా కేసులో టాలీవుడ్ సెలబ్రిటీస్ వీళ్ళే

Drug-Edditcted-Telugu-Movie-Stars-Tollywood-Drug-mafia-chrami-puri

టాలీవుడ్ డ్రగ్ మాఫియా వ్యవహారం పరాకాష్టకు చేరింది.కొన్నిరోజులుగా మాదక ద్రవ్యాల డొంక కొద్దికొద్దిగా కదులుతూనే వుంది. కొందరు యువకులు, విద్యార్థులు ఈ ఉచ్చులో దొరికిపోవడంతో ఐటీ కంపెనీలు, కార్పొరేట్ విద్యాసంస్థలకు నోటీసులు కూడా వెళ్లాయి. అప్పటికి టాలీవుడ్ కోణం పెద్దగా బహిర్గతం కాలేదు.కెల్విన్ అనే ఆ మాయగాడు దొరికిన తర్వాత ”ఇందులో కొందరు సినిమా సెలబ్రిటీల ప్రమేయం కూడా వుంది. కానీ.. వాళ్ళ పేర్లు మాత్రం బయటపెట్టేది లేదు” అంటూ ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి అకున్ సబర్వాల్ తేల్చి చెప్పేశారు. తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటికే డ్రగ్ అడిక్ట్స్ గా పేరుబడ్డ కొందరి గురించి ప్రస్తావిస్తూ.. వీళ్ళే డ్రగ్గు బాబులు అంటూ వస్తున్న వార్తలతో సినీ జనంలో గందరగోళం మొదలైంది

కొందరికి నోటీసులు అందిన మాట వాస్తవమేనని, ఆ కొందరితోనే పరిశ్రమ మొత్తం భ్రష్టుపోయినట్లు కాదని సమర్థించుకుంటూ ఫిలిం ఛాంబర్లో ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్ల సంఘాలు మీడియా ముందుకొచ్చి కడుపు చించుకున్నారు. కానీ.. ‘నోటీసులందుకున్న ఆ పదహారు మందీ ఎవరు’ అంటూ ప్రశ్నిస్తే ఒక్క పెద్దమనిషీ స్పందించలేదు. అఫ్ బీట్ లో కొన్ని పేర్లు బైటికొచ్చినా.. పేపర్లో రాయదగ్గ విశ్వసనీయత లేకపోయింది. ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, ఒక ఫైట్ మాస్టర్, ఒక సింగర్ మొగుడు, మరో ఇద్దరు టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్లు అంటూ ప్రచారం జరిగింది.

డ్రగ్స్ తో సంభందం ఉన్న టాలీవుడ్ హీరోలు పేర్లు బయట పెట్టిన ఎక్సైజ్ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టర్..

హీరోలు.…రవితేజ, నవదీప్,తనీష్,చిన్నా,తరుణ్, నందు,నితిన్,హేమచంద్ర
డైరెక్టర్…పూరి జగన్నాథ్. కృష్ణవంశీ
కెమెరామెన్… శ్యామ్ కె నాయుడు.
హీరోయిన్స్…ఛార్మి,ముమైత్ ఖాన్.

ఇప్పుడు వచ్చిన డర్టీ డజన్కు మించి చాలానే పేర్లు కృష్ణానగర్ సర్కిల్స్ లో వినిపించినా.. అవేమీ అధికారుల దృష్టికి రాలేదా? అన్నప్రశ్నలు పలువురు సంధిస్తున్నారు. అయితే.. ఇక్కడ చాలామంది మిస్ అవుతున్న పాయింట్ ఏమిటంటే.. తాజా డ్రగ్స్ ఎపిసోడ్ లో బయటకు వస్తున్న పేర్లు మొత్తం.. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్ కు సంబంధించిన వారు మాత్రమే.

డ్రగ్స్ వినియోగిస్తున్న మరికొందరు సినీ సెలబ్రిటీలు ఉన్నప్పటికీ వారి పేర్లు బయటకు రాకపోవటానికి కారణం.. వారెవరూ కెల్విన్ దగ్గర డ్రగ్స్ కొనుగోలు చేయకపోవటమేనని చెప్పొచ్చు. కెల్విన్ కస్టమర్ల చిట్టా మీదనే పోలీసులు ప్రస్తుతం దృష్టి సారిస్తున్నారు. రేపొద్దున మరో డ్రగ్ డీలర్ దొరికితే.. అతడి దగ్గర మరికొందరు కస్టమర్లు ఉండొచ్చు.. వారిలో సినీ ప్రముఖులు మొదలు.. మిగిలిన వర్గాల వారూ ఉండొచ్చని వివరంగా చెబుతున్నారు పోలీసులు అధికారులు. ఇప్పుడు బుక్ అయిన వారిని విచారించే క్రమంలో.. వారి కాల్ డేటాలు కానీ పోలీసులు పరిశీలించటం మొదలెడితే.. మరికొన్ని సంచలనాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.

Loading...