`మా` ఆధ్వర్యంలో ఈనెల 30న మంత్రి పద్మారావు `యాంటీ డ్రగ్` వాక్

Anti Drug Walk on 30th July in assosiation with MAA
Anti Drug Walk on 30th July in assosiation with MAA

ఈనెల 30 తేదీన ఉదయం 7 గంటలకు కే.బి.ఆర్ పార్క్ లో `మా` ( మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్) మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా `యాంటీ డ్రగ్ వాక్` కు తలపెట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎక్షైజ్ శాఖ మంత్రి పద్మారావు గారిని రావాల్సిందింగా నేడు మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షులు శివాజీరాజా, జనరల్ సెక్రెటరీ నరేష్ ఆయన నివాసానికి వెళ్లి కోరారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ సందర్భంగా
మంత్రి మాట్లాడుతూ ,` గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలన్నది మన ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం సిట్ చేస్తోన్న దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, సినిమా ఇండస్ట్రి లో ప్రత్యేకంగా ఎవరిపైనా కక్ష సాధింపు చేయడం లేదని, డ్రగ్ ఫ్రీ సిటి లక్ష్యంగా సినిమా పరిశ్రమ కూడా సహకరిస్తూ `యాంటీ డ్రగ్ వాక్` కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం. అలాగే మాదక ద్రవ్యాల వాడకంను ఉక్కుపాదంతో అణిచివేసి వాటి బారిన పడుతున్న యువతియువకులను కాపాడి బంగారు తెలంగాణకు బాటలు వేస్తాం` అని మంత్రి తెలిపారు.
ఈ కార్యక్రమంలో `మా` కార్యవర్గ సభ్యుడు సురేష్ కొండేటి, తెరాస యువజన నాయకులు కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Loading...