మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్

ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా లోగో లుక్ ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో మెగాస్టార్ ఇటు టాలీవుడ్ లోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా తన ప్రభంజనం చెప్పబోతున్నాడని ఇప్పుడు లోగో లుక్ మోషన్ పోస్టర్ ను చూస్తే చెప్పేయవచ్చు. మనం అనుకున్నట్లు ‘సైరా’ అనే టైటిల్ నే సెలక్ట్ చేసుకున్నారు.. కాకపోతే మరో చిన్న ఎడిషన్ కూడా ఉంది.

“సైరా.. నర్సింహరెడ్డి” అనే టైటిల్ తో ఇప్పుడు సురేందర్ రెడ్డి డైరక్షన్ లో.. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందబోతుంది. బ్రిటీష్ వారు ఎలా మన దేశానికి వచ్చి మన కోటలపై వారి జెండాలను ఎగరవేశారో.. ఎలాగైతే ఆ జెండాలను తగలబెట్టి ఉయ్యాలవాడ ఒక రెబెల్ లా తయారై వారిని గడగడలాడించాడో ఈ సినిమా మోషన్ పోస్టర్ చూస్తే మనం అర్ధం చేసుకోవచ్చు. టైటిల్ డిజైన్ మరియు ఇతర లుక్ అంతా అదిరిపోయింది. ముఖ్యంగా టైటిల్ లో ఆ కత్తి నిజంగానే ఉయ్యాలవాడ వాడిని కత్తిని చూసి తయారుచేయించినట్లున్నారు.

ఇకపోతే ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు అంటూ పోస్టర్ మీద పేరు చూడగానే ఒక తెలియని ఎక్సయిట్మెంట్ చాలామంది మ్యూజిక్ లవ్వర్లకు వచ్చేస్తోంది. అలాగే రవివర్మన్ ఫోటోగ్రాఫి.. రాజీవన్ ఆర్ట్.. పరుచూరి బ్రదర్స్ కలం.. అన్నీ బలంగానే కనిపిస్తున్నాయి. చూద్దాం మరి సినిమా ఎలా ఉండబోతుందో!!

Loading...