యండమూరి షాకింగ్ కామెంట్స్ – శవాల మీద చిల్లర ఏరుకునే షో లవి

ఈ మధ్య టీఆర్పీల కోసం మాత్రమే షోలను చేస్తున్నారు అని అన్నారు యండమూరి. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యలను నలుగురికి తెలిసేలా బహిరంగ చర్చకు తెస్తున్నారు. ఆ టీవీ షోలలో తీర్పులిచ్చే వాళ్లు తమను మేథావులుగా భావించుకుంటారని విమర్శించారు. తీర్పులిచ్చేవాళ్ల  సీక్రెట్లన్నీ తనకు తెలుసన్నారు. హైదరాబాద్ లో వారు సంప్రదించే  సైకియాట్రిస్ట్ లందరూ తనకు ఫ్రెండ్సేనని చెప్పారు. టీవీ షోలలో తీర్పు ఇచ్చే స్థానంలో ఓ కుక్కను కూర్చోపెట్టినా అది తీర్పిచ్చేస్తూ ఉంటుందన్నారు.

మానసికంగా ఆనందంగా ఉండే వాళ్లెవ్వరూ ఇలాంటి షోలు చూడాల్సిన అవసరం లేదని యండమూరి సమాధానమిచ్చారు.అలాంటిషోలను నిలిపివేయాలని యండమూరి గారు హెచ్చరించారు అలాంటి షోలకి రేటింగ్ రావడం హాస్యాస్పదం అన్నారు, యీ లాంటి షోలు చెయ్యడం వల్ల టీవీ ఇండస్ట్రీ చెడ్డ పేరు వస్తున్నదని అన్నారు.ఈ షోలని చేసేవారి శవాలమీద చిల్లర సంపాదించడం అని చెప్పారు

Loading...