‘వాడొస్తాడు’ మోషన్ పోస్టర్ విడుదల

2m  సినిమాస్ బ్యానర్ పై కె.వి.శబరీష్ సమర్పిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘వాడొస్తాడు’.  కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్ హీరోహీరోయిన్లుగా. సారథి దర్శకత్వంలో  తెరకెక్కుతున్న ఈ చిత్ర మోషన్ పోస్టర్ ని జూలై 15 న ప్రముఖ కొరియా గ్రాఫర్, హీరో, డైరెక్టర్ రాఘవ లారెన్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కె. వి.శబరీష్, సారథి లు మాట్లాడుతూ.. అడగగానే ‘వాడొస్తాడు’ మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన లారెన్స్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. హీరో శ్యామ్ ఈ ‘వాడొస్తాడు’ చిత్రంతో అందరినీ ఆకట్టుకుంటాడు. ఈ చిత్రంలో శ్యామ్ కి జంటగా ఆత్మీయ, శ్రీదేవి కపూర్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వీరితో పాటు హాలీవుడ్ ఆర్టిస్ట్స్ కూడా ఈ చిత్రం లో నటిస్తున్నారు. ప్రేక్షకుల అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా..సినిమాని హై టెక్నికల్ వ్యాల్యూస్ తో, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాము…అని అన్నారు.
కిక్ శ్యామ్, ఆత్మీయ, శ్రీదేవి కపూర్, శ్రీనాథ్, జస్టిన్ వికాజ్(హాలీవుడ్), లూకాస్ శాండ్రాస్ (హాలీవుడ్) తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి  కెమెరా: ఎం ఎస్ రాజేష్ కుమార్, సంగీతం: శ్యామ్ మోహన్, ఆర్ట్: టీఎన్ కబిలన్, ఎడిటర్: అరుణ్ థామస్ ఏ.కె.డి, ప్రొడక్షన్ కంట్రోలర్: ఎం విజయ్ కుమార్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: టి.వి జనార్దన్, కుట్టి కృష్ణన్, మారియప్పన్ జి, పి.ఆర్.ఓ: పర్వతనేని రాంబాబు, నిర్మాణం: 24  సినిమాస్, సమర్పణ: కె.వి.శబరీష్, దర్శకత్వం: సారథి.

 

 

Loading...