సాంగ్స్ రికార్డింగ్ లో ‘లోకరక్షకుడు’

చంద్రాస్ ఆర్ట్ మూవీస్ బ్యానర్పై చండ్ర పర్వతమ్మ సమర్పణలో చంద్రశేఖర్ చండ్ర నిర్మిస్తున్న ‘లోకరక్షకుడు’ చిత్రం మార్చి లో లండన్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. బ్రహ్మం సి.హెచ్. ఈ చిత్రానికి దర్శకుడు. పలు భాషల్లోనూ, పలు దేశాల నటీనటులతో తెరకెక్కుతున్న ఈ చిత్ర లోగోని లండన్ పార్లమెంట్లో ఎమ్.పి. బాబ్ బ్లాక్మెన్ ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ చిత్రం చెన్నై లో సాంగ్స్ రికార్డింగ్ జరుపుకుంటుంది.
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ చండ్ర మాట్లాడుతూ.. ఏసుక్రీస్తు జీవిత చరిత్రని అత్యద్భుతంగా, క్రొత్త అంశాలతో తెరకెక్కిస్తున్నాము. ప్రపంచ పటంలో అనాదిగా భారతదేశం శాంతి చిహ్నాము. గౌతమ బుద్ధుడు, మహాత్మాగాంధీ తదితర మహానుభావులు ప్రపంచశాంతికి మార్గ దిశని చూపారు. అలాగే ఏసుక్రీస్తు జీవితం, మార్గం, సందేశం పలు వర్గాలలో, ప్రదేశాలలో శాంతి నింపే విధంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాము. ఈ చిత్రం లోని పాటలు ప్రస్తుతం చెన్నై దేవా గారి అమ్మ టాకీస్ స్టూడియోలో రికార్డింగ్ జరుపుకుంటున్నాయి. మంచి లిరిక్స్ కుదిరాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎ.కె. రిసాల్ సాయి గారు మంచి ట్యూన్స్ కంపోజ్ చేస్తున్నారు. సింగర్ మధుబాల కృష్ణన్, గీతామాధురి, హేమాంబిక లు హృదయాలను కదిలించే విధంగా ఆలపిస్తున్నారు. అభినవ్ శ్రీనివాస్ రాసిన పాట ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించి 2 షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. 3 వ షెడ్యూల్ ని ఆగష్టు 3 వ వారం నుండి ఫారిన్ ఆర్టిస్ట్ లతో కర్ణాటకలో జరుపనున్నాము.. అని అన్నారు.
15 దేశాల ఆర్టిస్ట్ లు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎ.కె. రిసాల్ సాయి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: జి. క్రిష్, రైటర్: డి. కృపాకర్, లిరిక్స్: డి. కృపాకర్, అభినవ్ శ్రీనివాస్, రామ్ పైడిశెట్టి; సమర్పణ: చండ్ర పర్వతమ్మ, నిర్మాత: చంద్రశేఖర్ చండ్ర, దర్శకత్వం: సి.హెచ్. బ్రహ్మం

Loading...