సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ ‘స్పైడర్’ తమిళ రైట్స్ ‘లైకా’ సొంతం

spyder movie mahesh babu ar muragados tamilnadu rights
spyder movie mahesh babu ar muragados tamilnadu rights

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ ‘స్పైడర్’ తమిళ రైట్స్ ‘లైకా’ సొంతం
సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘స్పైడర్’. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. కాగా, ఈ చిత్రం తమిళ రైట్స్‌ని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రోబో చిత్రానికి సీక్వెల్‌గా ‘2.0’ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. మహేష్, మురుగదాస్ కాంబినేషన్లో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ‘స్పైడర్’ చిత్రంపై అన్ని చోట్ల భారీ అంచనాలు వున్నాయి. దాన్ని దృష్టిలో వుంచుకొని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ‘స్పైడర్’ తమిళ రైట్స్‌ని దక్కించుకుంది.
ఈ సందర్భంగా లైకా ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్ రాజు మహాలింగం మాట్లాడుతూ – ”స్పైడర్’ చిత్రంపై ఎంతటి భారీ అంచనాలు వున్నాయో మాకు తెలుసు. మహేష్, మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్లో హై టెక్నికల్ వేల్యూస్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ్లో విడుదల చేయడం చాలా ఆనందంగా వుంది. ‘స్పైడర్’ మా సంస్థలో మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది” అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జయరాజ్, సినిమాటోగ్రఫీ: సంతోష్ శివన్ ఎఎస్సి.ఐఎస్సి, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్ సుచక్, ఫైట్స్: పీటర్ హెయిన్, సమర్పణ: ఠాగూర్ మధు, నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.

Loading...