హిందూ మనోభావాలను గౌరవిస్తాము-నాకు నేనే తోపు తురుమ్ నిర్మాత

naku nene topu turum movie poster
naku nene topu turum movie poster

ధృవ క్రియేషన్స్ పతాకంపై అశోక్ కుమార్, మానస జంటగా నటించిన చిత్రం ‘నాకు నేనే తోపు తురుమ్’. దర్శకుడు జి. శివమణి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతోంది.
ఈ చిత్రంలో హిందూ మతాన్ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి అంటూ హిందూ జనశక్తి సంస్థ చెప్పింది. అయితే తమకు ఏ మతాన్ని కించపరిచే ఉద్దేశం లేదని చిత్ర నిర్మాత ధృవ కుమార్ తెలిపారు. అలా భావించిన వారికి క్షమాపణలు చెప్పారు. నిర్మాత ధృవ కుమార్ మాట్లాడుతూ …”హిందూ మతం అంటే మాకు అపారమైన గౌరవం ఉంది. ఏ మతాన్ని కించపరిచేలా సినిమా ఉండదు. ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ స్వార్ధంతో బతుకుతున్నారు. ధర్మం అనేది లేకుండా పోయింది అనే విషయాన్ని కొంత అగ్రెసివ్ గా చెబుతూ ప్రచారం చేశాం. మాకు తెలియకుండానే ఎవరైనా నొప్పిస్తే క్షమాపణ కోరుతున్నాను. ఈ విషయం మా దృష్టికి తీసుకుని వచ్చిన హిందూ జనశక్తి సంస్థకు, సంస్థ అధ్యక్షుడు లలిత్ కుమార్, ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుచున్నాను. అన్నారు.

Loading...