హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ డైరెక్టర్ అత్యాచారయత్నం

Actress Files Attempt To Rape Case Against Director Chalapathi, Srujan

సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపే యువతులకు వలవేసి కొందరు వ్యక్తులు దారుణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ అమ్మాయికి సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానంటూ ఓ డైరెక్టర్ సమాజం తలదించుకునేలా వ్యవహరించాడు. డైరెక్టర్ చలపతి, హీరో సృజన్‌ తనపై అత్యాచారయత్నం చేశారని పటమట పోలీసులకు యువతి

ఫిర్యాదు చేసింది. భీమవరంలో షూటింగ్‌ ఉందంటూ కారులో ఎక్కించుకుని అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి ఆవేదన వ్యక్తం చేసింది. యువతి ప్రతిఘటించడంతో నిడమానూరు వద్ద కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది. డైరెక్టర్ నుంచి తప్పించుకుని బాధితురాలు పటమట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్శకుడు చలపతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Loading...