దమ్ముంటే ఆ ముగ్గురు హీరోల పేర్లు బయటపెట్టండి.మీకు దమ్ముందా.నేను చెప్పే మాటలు రాయగలరా..?? – పూరి

ఆ ముగ్గురు హీరోలు పత్తిత్తులు కాదు  దమ్ముంటే బయటపెట్టండి.మీకు దమ్ముందా.నేను చెప్పే మాటలు రాయగలరా..??

*సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తూన్న వార్త**

మీరు నిజంగా ఇన్వెస్టిగేషన్ జర్నలిజం చేస్తుంటే నేను చెప్పిన ఈ ముగ్గురి పేర్లు రాయగలరా.?ఇదే విషయాన్ని మీకు లీక్ ఇచ్చిన ఆ అధికారులను ప్రశ్నించగలరా..? 15 మందికి నోటీసులు అని చెప్పి ఎనిమిది మంది పేర్లు బయటపెట్టటం ఏంటీ.మిగతా వాళ్లలో ఎవరెవరు ఉన్నారు.వాళ్ల పేర్లు ఎందుకు బయటకు రావటం లేదు.ఈ పంచ్ డైలాగ్స్ పేల్చింది ఎవరో కాదు డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్.

అన్ని పత్రికలు,టీవీలతోపాటు సోషల్ మీడియాలో సైతం డ్రగ్స్ రాకెట్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.నోటీసులు కూడా అందుకున్న ఈ స్టార్ డైరెక్టర్ వివరణ కోసం కొందరు మీడియా ప్రముఖులు ఆయన్ను సంప్రదించారు.తనకు నోటీసులు వస్తే వెళతా.విచారణ ఎదుర్కొంటా అంటూనే…. పైన చెప్పిన పంచ్ డైలాగ్స్ పేల్చారు.దీంతో ఖంగుతిన్న మీడియా వారు.వారి పేర్లు చెబితే వేస్తాం చెప్పే దమ్ము మీకుందా అని అడిగారంట.ఇక్కడే పూరీకి ఎక్కడో కాలింది.రాసుకోండి అంటూ కొన్ని పేర్లు చెప్పారు.నోటీసులు అందుకున్న వారిలో లెజెండ్ యాక్టర్ మంచు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్, గ్రేట్ స్టార్ ప్రొడ్యూసర్ దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్,అల్లు అరవింద్ పెద్ద కొడుకు బాబీ కూడా ఉన్నారని.వారికి కూడా నోటీసులు వచ్చాయని వారి పేర్లు ఎందుకు బయటపెట్టటం లేదని నిలదీవాడు.ఏదో చేద్దామని ఆయన్ను సంప్రదిస్తే ఇరుకున పెట్టేశాడని.ఇప్పుడు వాళ్లను టచ్ చేస్తే రేపటి నుంచి టీవీల్లో చిన్న సినిమా బిట్ కూడా ప్లే చేసుకోలేమంటూ మిన్నకుండిపోయారంట.పూరీ అంటే లోఫర్,ఇడియట్,కంత్రీగాడు అంటూ తెగ ప్రచారం చేసేస్తున్నారు.నిజమే నేను గతంలో డ్రగ్స్ తీసుకున్నాను.ఇప్పుడు అందులో నుంచి బయటపడ్డాను.దీని వల్ల ఎవరికీ హాని తలపెట్టలేదు.వందల కోట్లు సంపాదించి కట్టుబట్టలతో రోడ్డుపై పడ్డాను.దిక్కులేకుండా ఉన్నా.ఆ టెన్షన్ నుంచి బయటపడేందుకు డ్రగ్స్ తీసుకున్నాను. ఇది కూడా తప్పే.దీని నుంచి బయటపడ్డాను కూడా.పూరీ ఏమీ చేయలేడు.వాడేం పీకుతాడు అన్నట్లుగా మీ ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు. న్యాయం అందరి పక్షం ఒకేలా ఉండాలి.. కొందరికి ఎక్కువగా మరికొందరికి తక్కువగా ఉండకూడదు.వాళ్లను బయటకు లాగండీ అంటూ ఘాటుగానే స్పందించాడు..

Loading...