బోయపాటి శీను చేతుల మీదుగా `ఎందుకో ఏమో` ఫస్ట్ సాంగ్ లాంచ్!!

ENDUKO EMO Movie 1st song launched by Director Boyapati Sreenu,nandu,enduko emo first song launch,noyal,punarnavi,enduko emo songs,nandu endukoemo movie
ENDUKO EMO Movie 1st song launched by Director Boyapati Sreenu,nandu,enduko emo first song launch,noyal,punarnavi,enduko emo songs,nandu endukoemo movie

మహేశ్వర క్రియేషన్స్ పతాకంపై నందు,నోయల్, పునర్నవి హీరో హీరోయిన్లుగా కోటి వద్దినేని దర్శకత్వంలో మాలతి వద్దినేని నిర్మిస్తోన్న చిత్రం `ఎందుకో ఏమో`. ఈ చిత్రంలోని మొదటి పాటను మంగళవారం దర్శకుడు బోయపాటి శీను ఆవిష్కరించారు .ఈ సందర్భంగా బోయపాటి శీను మాట్లాడుతూ…“ ఎందుకో ఎమో` టైటిల్ క్యాచీగా ఉంది. నేను విడుదల చేసిన మొదటి పాట వినడానికే కాదు, చూడటానికి కూడా చాలా బావుంది. దీన్ని బట్టి సినిమా కూడా బావుంటుందని అర్ధమవుతోంది. నందు లో ఎలాంటి నటుడో నేను చేసిన `జయ జానకి` చిత్రంతో తెలిసిందే. నందు చాలా హార్డ్ వర్కర్ కూడా. హీరోగా ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలని ఆశిస్తున్నా. అలాగే దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు“ అన్నారు.

హీరో నందు మాట్లాడుతూ…“బోయపాటి శీను గారి చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వారి సినిమాల్లో అవకాశాలు ఇస్తూ…ఇలా నేను సోలోగా చేసే సినిమాలను కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు లాంచ్ అయిన పాట నా ఫేవరేట్. మంచి లొకేషన్స్ లో తీయడ్ం జరిగింది. మా దర్శక నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను పూర్తి చేశారు“ అన్నారు.

దర్శకుడు కోటి వద్దినేని మాట్లాడుతూ….“ఎంతో బిజీ షెడ్యూల్ లో కూడా బోయపాటి శీను గారు మా సినిమాలోని మొదటి పాటను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇందులో మొత్తం నాలుగు పాటలున్నాయి. ప్రవీణ్ ఒక్కో పాటను ఒక్కో విధంగా కంపోజ్ చేశారు. మ్యాంగో ద్వారా పాటలు విడుదల చేస్తున్నాం. ఇటీవల వినాయక్ గారు విడుదల చేసిన టీజర్ కు మంచి రెస్సాన్స్ వస్తోంది. సినిమాను మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం“ అన్నారు.

సంగీత దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ…“ఫస్ట్ సాంగ్ బోయపాటి శీను గారి చేతులమీదుగా లాంచ్ చేయడం చాలా హ్యాపీ. దర్శకుడు కోటి గారు పూర్తి స్వేచ్ఛనిచ్చి నాతో మంచి పాటలు చేయించుకున్నారు. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. పాటలు విని అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా“ అన్నారు.

నందు, నోయల్, పునర్నవి, పోసాని, సూర్య, సుడిగాలి సుధీర్, నవీన్, రాకెట్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతంఃప్రవీణ్; కెమెరాఃజియస్ రాజ్ (మురళి); ఎడిటింగ్ః మధు; ఆర్ట్ః వర్మ; ఫైట్స్ః డ్రాగన్ ప్రకాష్; నిర్మాతః మాలతి వద్దినేని; కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వంఃకోటి వద్దినేని.

Loading...